అప్పట్లో లక్ష మందిని తరలించారు. ఇప్పుడు 18 వేల మందిని తరలించలేరా? యశ్వంత్ సిన్హా సూటి ప్రశ్న
ఉక్రెయిన్‌పై రష్యా రోజురోజుకీ అత్యంత పాశవికంగా దాడులకు తెగబడుతున్నా.. భారత ప్రభుత్వం మాత్రం అక్కడి భారతీయులను తరలించడంలో అలసత్వం వహిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి , తృణమూల్ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా విమర్శించారు. ప్రభుత్వం అనుసరించే విధానాల వల్లే ఉక్రెయిన్‌లో భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 18,000 మంది భారతీయులు ఉన్నారని, గతంలో గల్ఫ్ సంక్షోభం తలెత్తినప్పుడు లక్షకు పైగా భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తెచ్చారని యశ్వంత్ సిన్హా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘ఉక్రెయిన్‌లో 18,000 మంది భారతీయులున్నారు. 1990 సమయాల్లో గల్ఫ్ యుద్ధం సంభవించింది. ఆ సమయంలో దాదాపు లక్షా 70 వేల మందిని కువైట్ నుంచి సురక్షితంగా తరలించారు. ఈ తరలింపును అప్పటి విదేశాంగ మంత్రి ఐకే గుజ్రాల్ స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పుడు కేవలం 18,000 మంది భారతీయులు మాత్రమే ఉక్రెయిన్‌లో ఉన్నారు. వారి తరలింపులో ఎందుకు ఆలస్యమవుతోంది?’ అంటూ విదేశాంగ శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడంలో తమ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తోందంటూ కేంద్రం యూపీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ కూడా ఇలా ప్రచారం చేస్తున్నారని, ఇదేమీ గొప్ప పని కాదని, ఇది ప్రభుత్వ బాధ్యత అని యశ్వంత్ సిన్హా గుర్తు చేశారు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం వస్తుందని ప్రభుత్వానికి తెలుసని, ఉక్రెయిన్ గగనతలంలో ఆంక్షలు లేనప్పుడే భారతీయులను తరలించి వుంటే బాగుండేదని యశ్వంత్ సిన్హా అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

