Ex RAW Agent Arrest | భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దోపిడీ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర చేశారంటూ అగ్రరాజ్యం అమెరికా అభియోగాలు మోపింది. పరారీలో ఉన్నట్లుగా ఎఫ్‌బీఐ నోటీసులు జారీ చేసిన నేపత్యంలో ఆయనను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దోపిడీ కేసుకు సంబంధించి గతేడాది వికాస్ యాదవ్ అరెస్టుకాగా.. ఏడునెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పన్నూ హత్య కుట్ర కేసులో న్యూయార్క్ కోర్టులో న్యాయశాఖ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. భారత పౌరుడైన వికాస్‌యాదవ్ (39)పై మనీలాండరింగ్, కుట్రకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం తదితర అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం అతని ఆచూకీ తెలియడం లేదని ఛార్జ్‌షీట్‌లో ఎఫ్‌బీఐ పేర్కొంది.
గతంలో వికాస్ ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు. విదేశీ ఇంటిలెజెన్స్, రా విభాగాన్ని నిర్వహించే కేబినెట్ సెక్రటేరియట్లో సేవలందించారు. అమెరికా గడ్డపై పన్ను హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేసినట్లు అమెరికా గతంలో ఆరోపణలు చేసిన విధితమే. భారత ఉద్యోగితో కలిసి పన్నును హత్య చేసేందుకు నిఖిల్ కుట్ర పన్నినట్లుగా అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇప్పటికే చెక్ రిపబ్లిక్ జైలులో గుప్తాను అమెరికాకు అప్పగించినట్లుగా మీడియా కథనాలు తెలిపాయి. ఈ కేసు వ్యవహారంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వనికి సమన్లు పంపింది. అయితే, ఈ ఆరోపణలను ఖండించింది. విచారణ కోసం ఓ దర్యాప్తు కమిటీని నియమించింది. ఇటీవల భారత అధికారుల బృందం అమెరికా విదేశాంగ, న్యాయశాఖ అధికారులతో భేటీ అయ్యింది. అభియోగాల్లో పేర్కొన్న అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పని చేయడం లేదని న్యూఢిల్లీ తమకు వెల్లడించిందని విదేశాంగ మంత్రి మాథ్యూ మిల్లర్ ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అభియోగాలు నమోదు చేసింది.