న్యూఢిల్లీ, జూలై 22 : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ లంచం తీసుకున్నారు. 2009 సంవత్సరంలో వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ.300 కోట్ల రుణ మంజూరులో రూ.64 కోట్లను లంచం రూపంలో తీసుకున్నట్టు అప్పీలెట్ ట్రిబ్యునల్ తెలిపింది.
గతంలో పీఎంఎల్ఏ క్లీన్చిట్ పొందిన వీడియోకాన్ గ్రూపు ఈసారికిగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పలు అనుమానాలను వ్యక్తంచేసింది. ముఖ్యంగా ఈ కేసులో ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నది. వీడియోకాన్ గ్రూపునకు రుణాన్ని మంజూరు చేసినందుకుగాను కొచ్చర భర్తకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్ ఎనర్జీలో వీడియోకాన్ గ్రూపు రూ.64 కోట్ల మేర నిధులు మళ్లించినట్టు ట్రిబ్యునల్ గుర్తించింది.