Harbhajan Singh | ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హర్బజన్‌సింగ్.. భజ్జీ.. భవిష్యత్‌లో రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చాడు. తనకు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని చెప్పాడు. కానీ తానింకా భవిష్యత్తుపై ప్రణాళిక రూపొందించుకోలేదని శనివారం ప్రకటించాడు. తాను క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తానని చెప్పాడు. ఇంకా తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటే అందరికీ తెలియజేస్తా అని అన్నాడు. నిజం చెప్పాలంటే భవిష్యత్ గురించి ఎటువంటి ఆలోచనే లేదని పేర్కొన్నాడు. పలు పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని తెలిపాడు.
రాజకీయాల్లోకి వెళ్లడం చిన్న విషయం కాదని హర్బజన్‌సింగ్ స్పష్టం చేశాడు. రాజకీయాల్లో చేరడానికి సిద్ధం అనుకున్న రోజు ముందుకెళ్తానని వివరించాడు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవ్‌జ్యోతి సిద్దూతో మామూలుగానే భేటీ అయ్యానన్నాడు. ఎన్నికల ముంగిట కలవడంతో ఊహాగానాలు వినిపిస్తున్నాయని వెల్లడించాడు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే అందరికీ చెబుతానని తెలిపాడు.