జైసల్మేర్: రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ మంత్రి షాలె మొహమ్మద్ మాజీ వ్యక్తిగత సహాయకుడు, ప్రభుత్వ ఉద్యోగి సకుర్ ఖాన్ మంగలియా పాక్ గూఢచారిగా పని చేస్తున్నట్టు అనుమానించి బుధవారం అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సకుర్ ఖాన్ జైసల్మేర్ జిల్లా పరిపాలన కంట్రోల్ రూమ్‌లో పని చేశాడని పోలీసులు తెలిపారు.
అతడికి పాక్ ఎంబసీలోని ఓ అధికారికి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఖాన్ ఫోన్లో పాకిస్థాన్‌కు చెందిన పలు గుర్తు తెలియని ఫోన్ నెంబర్లున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు ఆరేడుసార్లు పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చినట్టు అంగీకరించాడని జిల్లా ఎస్పీ వెల్లడించారు.