Rawat | ఎన్నికల ముందు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దే అని తేల్చి చెప్పారు. ప్రచార పర్వంలోనే ఎక్కువగా పాల్గొనాలని నిర్ణయించుకున్నానని, ఇతరులు ఎన్నికల గోదాలోకి దిగుతారన్నారు.
కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ హైకమాండ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ తన చేతులను కట్టేసి, ఈదమంటోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ నుంచి తనకు తగిన సహకారం లభించడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు అనే మహా సముద్రంలో ఈదుతున్నానని, అధిష్ఠానం మాత్రం ప్రతికూల పరిస్థితిని సృష్టిస్తోందన్నారు. సముద్రంలో ఈదుతుంటే తన కాళ్లు, చేతులను కట్టేస్తోందంటూ మండిపడ్డారు. హరీశ్ చాలు.. ఇక విశ్రాంతి తీసుకోవాలని అంతరాత్మ చెబుతోందని రావత్ వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల తర్వాత రావత్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌తో భేటీ అయ్యారు. తన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని అధిష్ఠానం ఆయనకు హామీ ఇచ్చింది.