
Digital Profile for Indian | ఎన్నికల్లో ఓటేయడానికి ఓటర్ గుర్తింపు కార్డు.. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందడానికి ఆధార్ కార్డ్.. నగదు లావాదేవీలు తెలుసుకోవడానికి పాన్ కార్డు ఉపయోగించాల్సి వస్తున్నది. కానీ మున్ముందు ఒకే కార్డుతో అన్ని సేవలు పొందేందుకు.. లావాదేవీలు జరుపుకునేందుకు.. ఒకే ఐడీ కార్డు అందుబాటులోకి రాబోతున్నది. అందులో భాగంగా ప్రతి భారతీయుడికి ఒక డిజిటల్ ప్రొఫైల్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నది. వచ్చే ఏడాది నుంచి ఏకైక వెబ్సైట్ నుంచే అన్ని ప్రభుత్వ వసతులు వినియోగించుకోవచ్చు. నేషనల్ డిజిట్ ప్రొఫైల్ పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు.
ఒక్కసారి ఈ పోర్టల్లో లాగిన్ అయితే, నేషనల్ డిజిటల్ ప్రొఫైల్ కింద అన్ని రకాల ప్రభుత్వ వసతులను వాడుకోవచ్చు. ఇక ఒక్క కార్డుపైనే అన్ని సర్వీసులు అందుబాటులోకి తేవాలంటే దేశవ్యాప్తంగా ఈ-గవర్నెన్స్ అమల్లోకి రావాలి. ఉపాధి అవకాశాలు,ఎలక్ట్రానిక్ సర్వీసెస్ సమగ్ర వృద్ధికి ఈ-గవర్నెన్స్ అవసరం. దేశీయంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా యావత్ పబ్లిక్ సర్వీసెస్లో పరివర్తన తేవొచ్చు.
డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ దిశగా దేశంలో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత సెప్టెంబర్లో ప్రధాని నరేంద్రమోదీ.. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ప్రారంభించారు. ప్రజల హెల్త్ రికార్డులను భద్ర పరిచేందుకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్.. వారికి డిజిటల్ హెల్త్ ఐడీనిస్తుంది.