న్యూఢిల్లీ: తప్పు ఒప్పుకొన్నా శిక్ష తప్పదు, దోషిగా తేలిన తర్వాత హైకోర్టు తీర్పును పాటించాల్సిందే అంటూ డిస్మిస్ అయిన మాజీ జడ్జికి సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మాజీ జడ్జి చేసుకున్న అప్పీల్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. మాజీ జడ్జి తన కుటుంబ సభ్యులతో 2016లో విదేశాలకు వెళ్లగా, వారి హోటల్ ఖర్చు ఓ పిటిషన్‌దారు భరించాడని వెలుగులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి ఆ జడ్జిని ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి తొలగించింది.