Covid-19 Vaccine | టీకాల వృథాను అరికట్టాలి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల గడువు ముగింపు తేదీకి దగ్గరపడుతున్నందున దృష్టిలో పెట్టుకొని లేఖ రాసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ తెలిపారు. గతంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. 178కోట్ల డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 21,83,976 డోసులు వేసినట్లు చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రాలు కేంద పాలిత ప్రాంతాల్లో 15కోట్లకుపైగా డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించింది. గత 24 గంటల్లో కొత్తగా 6,561 కొవిడ్ -19 కేసులు రికార్డవగా.. 142 మరణాలు రికార్డయ్యాయి. కొత్తగా 14,947 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 77,152 ఉన్నాయని వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

