శుక్రవారం 05 జూన్ 2020
National - May 16, 2020 , 17:05:53

ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం

ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం

న్యూఢిల్లీ: ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం విధిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆర్థికంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. నాలుగో విడత ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మలా ఇవాళ మీడియా సమావేశంలో వివరించారు

'రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతం నుంచి 74శాతానికి పెంచుతున్నాం.  రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని రకాల ఆయుధాలను దేశీయంగా తయారు చేస్తాం. కొన్ని రకాల ఉత్పత్తులను మనం తయారు చేసుకోగలిగినప్పటికీ వాటిని చాలా కాలంగా దిగుమతి చేసుకుంటున్నాం. రక్షణ రంగానికి ఆయుధాలను సరఫరా చేసే ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని మరింత అభివృద్ధి చేస్తాం. డిఫెన్స్‌ సెక్టార్‌లో మేకిన్‌ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తామని' పేర్కొన్నారు. 


logo