ముంబై, మే 29: హనీ ట్రాప్‌లో చిక్కుకుని సున్నితమైన దేశ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌కు అందజేస్తున్నాడన్న ఆరోపణపై థాణెకు చెందిన ఒక జూనియర్ ఇంజినీర్‌ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) బుధవారం అరెస్ట్ చేసింది. థాణెకు సమీపంలోని కల్వలో నివసిస్తున్న 27 ఏండ్ల రవీంద్ర మురళీధర్ వర్మ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఏజెంట్ ఒకరు తనను ఫేస్బుక్లో మహిళగా పరిచయం చేసుకుని హనీట్రాప్‌లో పడేశాడు. దీంతో వర్మ గత ఏడాది మార్చి నుంచి దేశ రహస్యాలను వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ ఏజెంట్‌కు పంపుతున్నాడు.