హెచ్-4 ఈఏడీ వర్క్ పర్మిట్‌కు మంగళం?
అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉపాధి అనుమతిని రద్దు చేయడానికి ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ చర్య భారతీయ హెచ్-1బీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. వీరిలో చాలా మంది జీవిత భాగస్వాములు హెచ్-4 వీసాలను కలిగి ఉన్నారు.
- ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన
- అమలైతే హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగ ముప్పు
న్యూఢిల్లీ, ఆగస్టు 31: అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉపాధి అనుమతిని రద్దు చేయడానికి ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ చర్య భారతీయ హెచ్-1బీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. వీరిలో చాలా మంది జీవిత భాగస్వాములు హెచ్-4 వీసాలను కలిగి ఉన్నారు.
అంతేగాక అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు(ఈఏడీ) వారికి జారీ అయ్యాయి. 2014 నుంచి 2017 వరకు నమోదైన హెచ్-4 ఈఏడీ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే వాటిలో 93 శాతం మంది భారతీయ పౌరులేనని, అలాగే వారిలో 94 శాతం మంది మహిళలేనని తేలింది. రెజ్ఇన్ఫో.గవ్ వెబ్సైట్లో :ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పరిధిలో పొందుపరిచిన ఈ ప్రతిపాదనకు ఉపాధి అనుమతికి అర్హులైన పౌరేతరుల వర్గాల నుంచి హెచ్-4 డిపెండెంట్ జీవిత భాగస్వాములను తొలగించడం అని పేరు పెట్టారు.
కొత్తగా నియమించుకునే వారిని 1,03,265 డాలర్ల(సుమారు రూ.98.25 లక్షలు) రుసుమును విధించాలని డీహెచ్ఎస్ ఇటీవల ప్రతిపాదించగా ఉద్యోగం కోల్పోయిన తరవాత హెచ్-1బీ వీసాపై ఉన్న నిపుణులు కొత్త స్పాన్సర్షిప్ వెతుక్కోవడానికి ఇచ్చే 60 రోజుల గడువును తొలగించే ప్రతిపాదనకు వైట్ హౌస్ ఆమోదం తెలిపింది. కాగా ఈ ప్రతిపాదిత నిబంధనను అమలు చేసే దిశగా ముందుకు సాగితే అర్హత కలిగిన హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ప్రస్తుత హెచ్-4ఈఏడీ విధానం కింద ఉద్యోగ అనుమతిని పొందే లేదా దాన్ని కొనసాగించే అవకాశాన్ని కోల్పోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

