భోపాల్: మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో బుధవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు అదనపు ఎస్పీ విజయ్ డాబర్ తెలిపారు.
సంఘటన స్థలం నుంచి ఓ ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గాయపడిన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని తెలిపారు.