మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 09:10:03

ఇంట్లో ఉగ్రవాదులు.. పుల్వామాలో కొన‌సాగుతున్న ఎన్‌కౌంట‌ర్‌

ఇంట్లో ఉగ్రవాదులు.. పుల్వామాలో కొన‌సాగుతున్న ఎన్‌కౌంట‌ర్‌

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామాలో ఇవాళ ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.  ఓ సైనికుడు, ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది ఆ ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించారు.  ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డుతున్నారు.  అయితే ఓ ఉగ్ర‌వాదిని కాల్చివేశారు. సీఆర్‌పీఎప్ 183 బెటాలియ‌న్‌, రాష్ట్రీయ రైఫిల్స్‌, జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌డుతున్నారు.  ఉద‌యం 5.30 నిమిషాల‌కు ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. ఇంకా ఎదురుకాల్పులు జ‌రుగుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ సైనికుడితో పాటు ఓ పోలీసు కూడా గాయ‌ప‌డ్డారు.  


logo