ముంబై: ముంబైలో మోనోరైల్( Monorail) ప్రమాదానికి గురైంది. వాడాలా డిపోలో టెస్ట్ రన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఖాళీగా ఉన్న ఓ కోచ్ డిరేల్ అయ్యింది. దీంతో ఆ కోచ్ ఓ బీమ్‌ను ఢీకొట్టింది. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. ఆ రైల్ కెప్టెన్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. కోచ్ కూడా చాలా వరకు దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్యాసింజెర్లు ఎవరూ లేరు. మైనర్ ప్రమాదం జరిగినట్లు మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొన్నది.
మోనోరైల్‌లో తరుచూ సాంకేతిక సమస్యలు వస్తున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మోనోరైల్ ఆపరేషన్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజా ప్రమాదానికి చెందిన ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. రైల్‌కు చెందిన ఓ కోచ్ స్వల్పంగా ఒరిగినట్లు కనిపిస్తున్నది. ట్రాన్‌కు చెందిన బీమ్‌ను రైల్లోని ఫస్ట్ కోచ్ ఢీకొన్నట్లు తెలుస్తోంది.
ఆ రైల్ ముందు భాగం గాలిలోకి లేచింది. ఓ భారీ క్రేన్ సాయంతో డిరేల్ అయిన కోచ్‌ను తొలగించారు. ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వాడాలా డిపో వద్ద ఉన్న ట్రాక్ క్రాసోవర్ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు.