Surat | ముంబై: ఉద్యోగంలో ఒత్తిడితో ఓ ఉద్యోగి తన ఎడమ చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. వారం రోజుల క్రితం సూరత్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతివేళ్లు నరికేసుకున్న 32 ఏండ్ల వ్యక్తి.. నగరంలోని ఓ నగల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి ఎడమ చేతి నాలుగువేళ్లు తెగిపోయాక అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరపగా.. తనపై దాడి జరిగిందని తొలుత పోలీసులను నమ్మించాడు.
దీంతో కేసు విచారణ ఓ పజిల్‌గా మారింది. క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగా విచారణ జరపటంతో అసలు విషయం బయటకు వచ్చింది. స్థానికంగా ఉండే ఓ దుకాణంలో పదునైన స్టీల్ కత్తిని కొనుగోలు చేసిన సంగతి తెలుసుకున్న పోలీసులు అతడి చెబుతున్న విషయంపై అనుమానం వ్యక్తం చేశారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాలన్న కసితో, తనకు తానే హాని తలపెట్టుకున్నానని చివరికి అతడు ఒప్పుకున్నాడు. నగల దుకాణం యజమాని తన తండ్రికి దగ్గరి స్నేహితుడు అయినందున, ఉద్యోగంలో కొనసాగాలన్న ఒత్తిడి తనపై ఉందని, దీంతో పరిస్థితుల నుంచి తప్పించుకోలేక.. చేతి వేళ్లు కోసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అతడు వివరించాడు.