నెటిజన్లకు దించక్ పూజ పేరు చాలా సుపరిచితం. ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్.. బిగ్‌బాస్ 11 కంటెస్టెంట్ కూడా. సెల్ఫీ మైనే లేలీ ఆజ్ అనే పాటతో వైరల్‌గా మారింది. ఆ తర్వాత స్వాగ్ వాలీ టోపీ, దిలోంకా షూటర్‌తో పాటు కొన్ని కొవిడ్ పాటలతో ఫేమస్ అయ్యింది. ఏక్ అవుర్ సెల్ఫీ లేనే దో పాటతో ట్రోల్కుకూడా గురైంది. ఇప్పుడు అమెరికన్ రాపర్ ఎమినెమ్స్ పాటను హిందీలో రీక్రియేట్ చేసి, ఆకట్టుకుంటున్నది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది.
అమెరికన్ రాపర్ ఎమినెమ్స్ లూజ్ యువర్సెల్ఫ్ ఫ్రం పాటను దించక్ పూజా హిందీలో ఆట్ మీల్ పేరుతో దింపేసింది. ఈ వీడియోను తన యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఒక్కరోజులోనే ఈ వీడియోను 80వేల మందికి పైగా వీక్షించారు. అమెరికన్ పాప్ సింగర్ ఎమినెమ్స్ పాటను రీక్రియేట్ చేయాలంటే గట్స్ ఉండాలని, పూజ ఈ పాటకు న్యాయం చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.