న్యూఢిల్లీ: ఉపగ్రహ రంగంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలనానికి తెరతీయనున్నారు. ఏఐ ఉపగ్రహాల సముదాయాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ స్పేస్ ఎక్స్ ప్రతిపాదించిన ఏఐ ఉపగ్రహాల సముదాయానికి స్టార్మైండ్ అని పేరు పెట్టనున్నట్టు మస్క్ ధ్రువీకరించారు. ఏఐ ఆధారిత కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను కక్ష్యలో ప్రవేశపెట్టడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నెట్‌వర్క్‌లో 10 లక్షల వరకు ఉపగ్రహాలు ఉండచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. స్పేస్ ఎక్స్‌కు స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌కు, స్టార్మైండ్కు చాలా తేడా ఉంది. రెండు ప్రాజెక్టులు కూడా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల మీదే ఆధారపడినప్పటికీ రెండింటి లక్ష్యం ఒకటి కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ అనుసంధానతను కల్పించడానికి స్టార్‌లింక్‌ను ఏర్పాటు చేశారు.