కొడగు: కర్నాటకలోని కొడగు జిల్లాలో దారుణం జరిగింది. వణ్యప్రాణి క్యాంపులో రెండు ఏనుగులు(Elephants Fighting) కొట్టుకున్నాయి. అయితే ఆ ఫైటింగ్ జరుగుతున్న సమయంలో.. అక్కడ ఉన్న ఓ టూరిస్టు మహిళ ఓ ఏనుగు కింద పడి నలిగిపోయింది. ఈ ఘటనలో చెన్నై వాసి 33 ఏళ్ల జునేశ్ అనే మహిళ మృతిచెందింది. దుబేర్ ఎలిఫెంట్ క్యాంపులో ఈ ఘటన జరిగింది.
ఏనుగులకు స్నానాలు చేయిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కంచన్, మార్తాండ అనే గజరాజులు ఫైటింగ్ చేశాయి. అయితే మావటిలు వాటిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ విఫలం అయ్యారు. గొడవ పడ్డ ఏనుగుల్లో ఒకటి బ్యాలెన్స్ తప్పి అక్కడ ఉన్న మహిళపై పడింది. అయితే లేచి నిలబడే ప్రయత్నం చేసిన ఆ ఏనుగు కాలి కింద మహిళ చిక్కుకున్నది.
మార్తాండ అనే ఏనుగు కాలు కింద పడి జునేశ్ మృతిచెందింది. ఆ మహిళ మృతి పట్ల కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖాండ్రే నివాళి అర్పించారు.
#Kodagu Sad incident occurred while #ElephantBathing at #DubareCamp 33-year-old woman from #Chennai died on the spot@aranya_kfd@eshwar_khandre @BoskyKhanna @prajna_gr pic.twitter.com/73skY5l9ZU
— Amit Upadhye (@AmitSUpadhye) May 18, 2026