సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి
ఎన్నికల సంఘం వంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్
- నియమించిన 24 గంటల్లోనే బెంగాల్ డీజీపీపై ఈసీ వేటు
- కొత్త డీజీపీగా సంజయ్ముఖర్జీ
న్యూఢిల్లీ, మార్చి 19: ఎన్నికల సంఘం వంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విపక్షాలను టార్గెట్ చేసుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తన పార్టీ ఆఫీస్‌గా మార్చుకొనేంతగా.. ప్రజలను ఎదుర్కొనేందుకు బీజేపీ భయపడుతున్నదా? అని ప్రశ్నించారు.
24 గంటల్లోనే డీజీపీగా వివేక్ సహాయ్ తొలగింపు
పశ్చిమబెంగాల్లో డీజీపీ ఎపిపోడ్ మలుపులు తిరుగుతున్నది. డీజీపీగా ఉన్న రాజీవ్ కుమార్‌పై ఈసీ సోమవారం వేటు వేయగా.. రాష్ట్ర ప్రభుత్వం గంటల వ్యవధిలో కొత్త పోలీస్ బాస్‌గా వివేక్ సహాయ్ను నియమించింది. 24 గంటల్లోపే వివేక్ సహాయ్ ఆ పోస్టు నుంచి తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. కొత్త పోలీస్ బాస్‌గా ఆయన స్థానంలో సంజయ్ ముఖర్జీని నియమించింది. డీజీపీ బ్రదర్స్‌గా సహాయ్ సోదరులు పశ్చిమబెంగాల్ డీజీపీగా వివేక్ సహాయ్(1988 బ్యాచ్) నియామకం పోలీసు శాఖ చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది.
బీహార్‌లోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు ఐపీఎస్‌లు అవడమే కాక, రెండు రాష్ర్టాలకు వేర్వేరుగా డీజీపీలుగా నియమితులయ్యారు. వివేక్ సహాయ్ సోదరుడు వికాస్ సహాయ్(1989 బ్యాచ్) గత ఏడాది కాలంగా గుజరాత్ డీజీపీగా పనిచేస్తున్నారు. వీరి మరో సోదరుడు విక్రమ్ సహాయ్ కూడా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఐటీ విభాగంలో పనిచేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

