మంగళవారం 31 మార్చి 2020
National - Feb 26, 2020 , 02:02:16

మార్చి 26న రాజ్యసభకు ఎన్నికలు

మార్చి 26న రాజ్యసభకు ఎన్నికలు
  • తెలంగాణలో రెండు సీట్లు సహా 55 స్థానాలకు షెడ్యూల్‌
  • మార్చి 6న నోటిఫికేషన్‌..
  • 13 వరకు నామినేషన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ న్యూఢిల్లీ: తెలంగాణలో రెండు స్థానాలు సహా దేశవ్యాప్తంగా 17 రాష్ర్టాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు వచ్చేనెల 26న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. 17 రాష్ర్టాల్లోని 51 స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ కానున్నాయి. మరో నలుగురు సభ్యుల రాజీనామాతో ఖాళీలు ఏర్పడ్డాయి. వారి పదవీ కాలం కూడా ఏప్రిల్‌తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు మార్చి 5న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 26న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. తెలంగాణలో ఏప్రిల్‌ 9 నాటికి రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌), గరికపాటి మోహన్‌రావు (టీడీపీ) తెలంగాణకు ఎంపికయ్యారు. ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసే ప్రముఖుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌నారాయణ్‌సింగ్‌, కేంద్రమంత్రి రాందాస్‌ అథావలే  తదితరులున్నారు. మహారాష్ట్ర నుం చి ఏడు, తమిళనాడులో ఆరు, బెంగాల్‌, బీహార్‌ల్లో ఐదేసి, ఒడిశా, గుజరాత్‌, ఏపీల్లో నాలు గేసి, అసోం,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌ల్లో మూడే సి, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, జార్ఖండ్‌ల్లో  రెండేసి, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ లలో ఒక్కో స్థానం ఖాళీ కానున్నాయి. 
logo
>>>>>>