న్యూఢిల్లీ, డిసెంబర్ 25: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సన్నిహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాం గ్రెస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. వాటిని ఎలా నియంత్రించవచ్చో అంతర్జాతీయ నిపుణులతో కలిసి త్వరలోనే ప్రదర్శన నిర్వహిస్తానన్నారు. ఈవీలంకు వ్యతిరేకం గా నిరసనలు తెలపాలని రాజకీయ పార్టీలను కోరా రు. ఈవీఎంలతో జరిపే ఎన్నికలను బహిష్కరించడంపై పార్టీలు ఆలోచించాలని, ఈవీఎంలను ట్యాం పరింగ్ చేయొచ్చనే అనుమానం ఉందని చెప్పారు.