పట్నా: ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్లో బీజేపీ కంచుకోట బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి తెలిపారు.
బీహార్ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికై, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానం ఖాళీ అయ్యింది. సమ్రాట్ చౌదరి ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నిక ఒక ప్రజాభిప్రాయ సేకరణలాంటిదని పీకే అన్నారు.