Election Commission : కర్నాటకలో భారీగా నకిలీ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని, ఆ పార్టీతో ఎన్నికల సంఘం కుమ్ముక్కు అయిందని ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) మండిపడింది. విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికింది. ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు చూపాలని.. సంతకం చేసి ఎన్నికల సంఘానికి సమర్పించాలని రాహుల్కు సవాల్ విసిరింది ఎన్నికల సంఘం.
నకిలీ ఓట్ల విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న వాఖ్యలు పూర్తిగా అబద్ధమని పేర్కొన్న ఈసీ ఆయనను ప్రమాణం చేయాలని కోరింది. ‘ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాకు సంబంధించి రాహుల్కు ఏమైనా సందేహాలు ఉంటే ఆయన నిబంధన 20(3)(b) ప్రకారం రాహుల్ తన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. అంతేకాదు సతకం చేసిన పేపర్లను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయనకు తన మాటలపై విశ్వాసం లేకుంటే.. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. లేనిపోని ఆరోపణలు చేస్తూ జనాలను తప్పుదోవ పట్టించడం సరికాదు’ అని ఎక్స్ వేదికగా రాహుల్కు తెలియజేసింది ఈసీ.
❌The statements made are Misleading #ECIFactCheck
✅Read the details in the image attached 👇 https://t.co/746fmzkCvl pic.twitter.com/gvhEXXto8I
— Election Commission of India (@ECISVEEP) August 7, 2025
గురువారం రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల సమయంలో మహదేవపుర నియోజవర్గంలో బీజేపీకి తొత్తుగా వ్యవహిరిస్తూ అతిపెద్ద నేరానికి పాల్పడిందిన ఈసీని దుయ్యబట్టారు రాహుల్. ఆ స్థానంలో గెలిచేందుకు దాదాపు 1,00,250 నకిలీ ఓటర్లను సృష్టించారని ఆయన ఆరోపించారు. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి 32,707 ఓట్ల మెజార్జీతో విజయం సాధించారు.