నందిగ్రామ్‌లో రీకౌంటింగ్‌కు నో చెప్పిన ఎలక్షన్ కమిషన్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బంపర్ మెజార్టీతో గెలిచినా తమ అధినేత్రి ఓడిపోయిందన్న బాధ తృణమూల్ కాంగ్రెస్‌ను వేధిస్తూనే ఉంది. అందుకే నందిగ్రామ్‌లో మమత ఓటమిని జీర్ణించుకోలేక రీకౌంటింగ్ చేయాలని పట్టు బట్టింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం కుదరదని తేల్చిచెప్పింది. వీవీ ప్యాట్ స్లిప్స్‌ను లెక్కించిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మమతను ఓడించిన విషయం తెలిసిందే.
అయితే కౌంటింగ్ ప్రక్రియపై తృణమూల్ అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాదు కోర్టుకు కూడా వెళ్తామని ముఖ్యమంత్రి మమత ప్రకటించారు. పార్టీ గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె.. నందిగ్రామ్‌లో ప్రజల తీర్పును గౌరవిస్తూనే.. ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. నందిగ్రామ్ ఫలితాల విషయంలో అటు ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ కూడా చాలా నిదానంగా అప్డేట్ చేస్తూ వచ్చింది. సోమవారం ఉదయం 9.40 నిమిషాలకు ఈసీ నందిగ్రామ్ ఫలితాన్ని పూర్తిగా అప్డేట్ చేసింది. మొత్తం 17 రౌండ్ల కౌంటింగ్ తర్వాత సువేందుకు 109673 ఓట్లు, మమతకు 107937 ఓట్లు వచ్చినట్లు తేల్చింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

