న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మిజోరం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ నెల 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. షెడ్యూలు ప్రకారం ఈ ఓట్ల లెక్కింపు 3న జరగవలసి ఉంది. అయితే క్రైస్తవులు అధికంగా గల ఈ రాష్ట్రంలో ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉందని, అందువల్ల ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు షెడ్యూలు ప్రకారం ఆదివారమే జరుగుతుంది.