నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారం | తమిళనాడులో శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నెల 6న పోలింగ్

చెన్నై: తమిళనాడులో శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నెల 6న పోలింగ్ నిర్వహించనున్నారు. ఒకే విడుతలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల కోసం మొత్తం 1,55,102 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 80 ఏండ్లు పైబడినవారికి పోస్టల్ ఓట్లు వేసేలా అవకాశం కల్పించారు. దీనికోసం 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఎన్నికల బరిలో అన్నాడీఎంకే, డీఎంకే, కమల్‌హాసన్, దినకరన్ పార్టీలతోపాటు పలు రాజకీయ పక్షాలు పోటీలో ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది. ఇరుపక్షాలకు చెందిన రాష్ట్ర, జాతీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్‌గాంధీ తమ కూటముల పక్షాన ప్రచారం నిర్వహించారు.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గడువు మే 24తో ముగినయుంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ తదితర పక్షాలు ఉండగా, డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 25 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

