కాళ్లు, చేతులు కట్టేసి వృద్ధురాలిపై అత్యాచారం..!
Molestation: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. మహోబా జిల్లాలోని కబ్రాయ్ పట్టణంలో ఓ 45 ఏండ్ల వ్యక్తి 65 ఏండ్ల వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి

మహోబా: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. మహోబా జిల్లాలోని కబ్రాయ్ పట్టణంలో ఓ 45 ఏండ్ల వ్యక్తి 65 ఏండ్ల వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కట్లు విప్పకుండా పారిపోయాడు. స్థానికులు అచేతనావస్థలో ఉన్న వృద్ధురాలిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వృద్దురాలు కాళ్లు, చేతులకు ఉన్న కట్లను విప్పేశారు. అనంతరం వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం అధారంగా నిందితుడు భరత్ కుశ్వాహ (45)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

