జైపూర్: ఆలయానికి వెళ్లిన వృద్ధుడు అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురుగా కూర్చొన్న మహిళ కాళ్లను ఫొటో తీశాడు. (man takes pics of woman’s legs) గమనించిన ఆమె ఆ వృద్ధుడ్ని నిలదీసింది. దీంతో ఆ ఫొటోను అతడు డిలీట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఈ సంఘటన జరిగింది. దిల్వారా జైన్ టెంపుల్ వద్ద ఉన్న బెంచ్‌పై ఒక వృద్ధుడు కూర్చొన్నాడు. ఎదురుగా కూర్చొన్న మహిళ షార్ట్స్ ధరించి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమెను పదే పదే చూశాడు. తన మొబైల్ ఫోన్లో ఆ మహిళ కాళ్లను ఫొటో తీశాడు.
కాగా, ఆ మహిళ దీనిని గమనించింది. ఆ వృద్ధుడి వద్దకు వచ్చి నిలదీసింది. మొబైల్ గ్యాలరీని చూపించమని అడిగింది. అందులో ఆమె కాళ్ల ఫొటో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నా కాళ్ల ఫొటో ఎందుకు తీశావు? ఇదేమి పద్ధతి? ఆలయంలో ఇలా చేయడం సిగ్గులేదా?’ అని మండిపడింది. ఆ వ్యక్తి వెంటనే ఆ ఫొటోను డిలీట్ చేశాడు.
మరోవైపు ఆ మహిళ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వృద్ధుడి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.