Eknath Shinde : మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. ఇవాళ గొంతు నొప్పి, జ్వరం మళ్లీ తిరగబెట్టడంతో ఆయనను హుటాహుటిన థానేలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేసి.. తగిన చికిత్స అందిస్తామని తెలిపారు. షిండే గత వారం రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నాడు.
గత వారం ఆస్పత్రిలో చేరిన షిండే చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు శుక్రవారం సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ రెండు రోజులు ప్రశాంతంగా గడిపి, పరిస్థితి కొద్దిగా మెరుగనిపించడంతో ఆదివారం తిరిగి ముంబైకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ గొంతునొప్పి, జ్వరం తిరగబెట్టడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ షిండే ఆస్పత్రిలో చేరడం పలు అనుమానాలకు తావిస్తోంది.