చండీగఢ్ : పంజాబ్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) క్యాంపస్‌పై ఈడీ బుధవారం ఉదయం దాడులు నిర్వహించింది. లవ్లీ గ్రూప్.. ఆప్ ఎంపీ అశోక్‌కుమార్ మిట్టల్‌కు చెందినది. ఇటీవలే ఆయన రాఘవ్ చద్దా స్థానంలో ఆప్ రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీతో కుమ్మక్కయిన రాఘవ్ చద్దా ప్రధాని మోదీకి తొత్తులా మారారని ఆరోపిస్తూ ఇటీవల ఆప్ అధిష్ఠానం అతడిని డిప్యూటీ లీడర్‌గా తొలగించి, ఆ బాధ్యతను అశోక్ కుమార్‌కు అప్పగించింది.
దీంతో తమపై కక్షతో బీజేపీ ఈడీనీ ఉసిగొల్పిందని ఆప్ ఆరోపిస్తున్నది. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, చాన్స్‌లర్ అయిన కుమార్ మిట్టల్ తన సోదరులు రమేశ్ మిట్టల్, నరేశ్ మిట్టల్‌లతో కలిసి దానిని నిర్వహిస్తున్నారు.