న్యూఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసు(Betting App case)లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్ 1xBet కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 43 ఏళ్ల యువీ తెలుపు రంగు టీషర్ట్, పాంట్లో ఈడీ ఆఫీసుకు వచ్చాడు. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఈడీ కార్యాలయానికి 12 గంటలకు చేరుకున్నాడు. తన లీగల్ బృందంతో యువీ ఈడీ ఆఫీసుకు వెళ్లాడు. మాజీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పీఎంఎల్ఏ కేసులో యువీని ప్రశ్నించారు. ఇదే కేసులో ఇన్ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్ కూడా ఇవాళ ఈడీ ముందు హాజరయ్యాడు.
ఇప్పటికే ఈ కేసులో మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఊతప్పలను ఈడీ ప్రశ్నించింది. టీఎంసీ మాజీ ఎంపీ, నటుడు మిథున్ చక్రవర్తి, బెంగాలీ నటుగు అన్కుష్ హజ్రాలను కూడా కొన్ని వారాల క్రితమే ఈడీ విచారణ చేపట్టింది.
బెట్టింగ్ యాప్ కేసులో బుధవారం ఫిల్మ్ స్టార్ సోనూ సూద్‌ను కూడా ఈడీ విచారించనున్నది. 1xBet బెట్టింగ్ యాప్ ద్వారా కోట్లల్లో స్కామ్ చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఈడీ ఆరోపిస్తున్నది. పన్నులు కట్టకుండా ఎగవేస్తున్నారని ఈడీ పేర్కొన్నది. 1xBet బెట్టింగ్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. ఆ బుక్‌మేకర్ సంస్థ సుమారు 18 ఏళ్లుగా బెట్టింగ్ ఇండస్ట్రీలో వ్యాపారం చేస్తున్నది.
కస్టమర్లు వేల రకాల క్రీడలపై బెట్టింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ కంపెనీకి చెందిన వెబ్సైట్ , యాప్ దాదాపు 70 భాషల్లో అందుబాటులో ఉంటుంది. బెట్టింగ్ యాప్ కేసులో మరికొంత మంది క్రీడాకారులు, మూవీ నటులు, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలను ప్రశ్నించనున్నారు.