Gold smuggling case | 22న విచారణకు రావాలని స్వప్న సురేశ్‌కు ఈడీ నోటీసు..
Gold smuggling case | ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని బంగారం స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్‌కు ఈడీ నోటీసులిచ్చింది.
Gold smuggling case | బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొచి అధికారులు నోటీసులు జారీ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత స్వప్న సురేశ్ మీడియాతో మాట్లాడుతూ ఈ స్మగ్లింగ్ రాకెట్‌తో సీఎం, ఆయన భార్య, కుమార్తెతో సహా కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించారు. అంతకుముందు కోర్టులో సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం రహస్యంగా వాంగ్మూలం ఇచ్చారు. న్యాయస్థానంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు సేకరించారు. ఈ 27 పేజీల వాంగ్మూలంతో కూడిన ప్రకటన ప్రాతిపదికన స్వప్న సురేశ్‌కు ఈడీ నోటీసు జారీ చేసింది.
స్వప్న సురేశ్ ప్రకటనను అధ్యయనం జరిపిన ఈడీ అధికారులు తదుపరి విచారణను చేపట్టాలని ఈడీ కొచి యూనిట్‌ను ఆదేశించారు. మరో రెండు కేసుల్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్కు స్వప్న సురేశ్ ఇచ్చిన రెండు వాంగ్మూలాలను తమకు అందించేలా ఆదేశాలివ్వాలని ఈడీ జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలుచేసింది.
సీఆర్పీసీలోని 164 సెక్షన్ ప్రకారం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన స్వప్న సురేశ్.. ఈ బంగారం స్మగ్లింగ్ రాకెట్‌తో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణ, వ్యక్తిగత కార్యదర్శి సీఎం రవీంద్రన్, మాజీ ముఖ్య కార్యదర్శి శివ్ శంకర్, మాజీ కార్యదర్శి (రిటైర్డ్) నళిని నెట్టోలకు సంబంధం ఉందని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

