న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. బ్రిటన్ కేంద్రంగా ఉన్న ఆయుధ డీలర్ సంజయ్ భండారీతో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణ నమోదైంది.
రక్షణ ఒప్పందాల నుంచి వచ్చిన నిధులను ఉపయోగించి భండారీ ద్వారా లండన్, దుబాయ్‌లలో ఆస్తులను సంపాదించినట్టు వాద్రాపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు వాద్రాపై చార్జిషీట్ దాఖలు చేశారు.