ECI Vs Rahul | గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ అధికారికంగా లేఖ రాసింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు, రూల్స్‌కు అనుగుణంగానే నియమాలకు అనుగుణంగా అన్ని ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని పేర్కొంది. రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లతో సహా మొత్తం ఎన్నికల ప్రక్రియలో వేలాది మంది పాల్గొంటారని ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. ఓ ప్రముఖ దినపత్రికలో రాహుల్ గాంధీ రాసిన కథనానికి ప్రతిస్పందన ఎన్నికల కమిషన్ లేఖను కాంగ్రెస్ నేతకు పంపింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో వికేంద్రీకృత పద్ధతిలో జరుగుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఎన్నికల్లో 1,00,186 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs), 288 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs), 139 మంది జనరల్ అబ్జర్వర్లు, 41 మంది పోలీస్ అబ్జర్వర్లు, 71 మంది ఎక్స్పెండేచర్ పరిశీలకులు, కమిషన్ నియమించిన 288 మంది రిటర్నింగ్ అధికారులు (ROs) ఉన్నారని.. మహారాష్ట్రలోని 28,421 కాంగ్రెస్ పార్టీలతో సహా జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు 1,08,026 బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించాయని తెలిపారు. ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి అంశాలను కాంగ్రెస్ అభ్యర్థులు సమర్థ కోర్టు (హైకోర్టు)లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ల ద్వారా లేవనెత్తినట్లుగా విశ్వసిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ‘మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే.. లేఖ మాకు రాయొచ్చని.. అన్ని అంశాలను చర్చించేందుకు వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా కమిషన్ సిద్ధంగా ఉంది’ ఎన్నికల కమిషన్ పేర్కొంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. ఓట్ల దొంగతనం జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపించారు. మెషిని రీడబుల్ డిజిటల్ ఓటర్ రోల్స్, అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆరు నెలల్లోనే నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ బీజేపీ నేత దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ నియోజకవర్గంలో కొత్తగా 29,219 మంది కొత్త ఓటర్లు చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఓటర్లు కేవలం ఐదు నెలల్లోనే 8శాతం పెరిగిందని.. కొన్ని బూత్‌లలో 20-50శాతం పెరుగుదల కనిపించిందని మంగళవారం రాహుల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు.