‘సర్’ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే
ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఖండించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించి జారీ చేసిన మూడు ఉత్తర్వులపై నిర్ణయాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం ఏకగ్రీవంగానే తీసుకుందని సుప్రీంకోర్టుకు ఈసీఐ తెలియచేసింది.
- జ్ఞానేశ్ కుమార్‌వి ఏకపక్ష నిర్ణయాలు కాదు
- సుప్రీంకోర్టులో ఈసీఐ సవివర అఫిడవిట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఖండించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించి జారీ చేసిన మూడు ఉత్తర్వులపై నిర్ణయాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం ఏకగ్రీవంగానే తీసుకుందని సుప్రీంకోర్టుకు ఈసీఐ తెలియచేసింది. ఈసీఐ పనితీరును, సర్ సంబంధిత ఫారాలలో మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఆ ఆరోపణలు ఒకే ఒక్క వార్తా కథనంపై ఆధారపడి ఉన్నాయని ఈసీఐ పేర్కొంది.
సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ అఫిడవిట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారని స్పష్టం చేసింది. అంతర్గత చర్చల సందర్భంగా సీఈసీ లేదా ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన సూచనలు, పరిశీలనలు లేదా ప్రశ్నలను కమిషన్ తీసుకున్న నిర్ణయాలుగా పరిగణించకూడదని ఎన్నికల సంఘం తెలిపింది. 2025 జూన్, అక్టోబర్, 2026 మే నెలలో జారీ చేసిన మూడు సర్ ఉత్తర్వులు కమిషన్ ఏకగ్రీవ నిర్ణయాలని ఈసీఐ స్పష్టం చేసింది. తమ నిర్ణయ ప్రక్రియను వివరిస్తూ ఫైళ్లను సాధారణంగా మొదట ఒక ఎన్నికల కమిషనర్, ఆ తర్వాత మరొకరు పరిశీలించి, అనంతరం వాటిని ప్రధాన ఎన్నికల కమిషనర్ ముందు ఉంచుతారని తెలిపింది.
అత్యవసర సందర్భాల్లో ఆమోదాలను ఎలక్ట్రానిక్‌గా పొంది తదనంతరం ఫైల్లో నమోదు చేస్తారని పేర్కొంది. ఒక ఫైల్‌ను పరిశీలిస్తున్నప్పుడు ఈ ముగ్గురు సభ్యులలలో ఎవరైనా లేవనెత్తిన పరిశీలనలు లేదా ప్రశ్నలను ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నిక కమిషనర్ల చట్టం, 2023లోని సెక్షన్ 18 ప్రకారం అధికారిక నిర్ణయంగా పరిగణించలేమని ఆ అఫిడవిట్లో నొక్కి చెప్పారు. ఎటువంటి అంతర్గత నోట్‌ను లేదా ఫైల్‌ను మీడియాకు విడుదల చేయలేదని, అలాగే అటువంటి వాటిని విడుదల చేయడానికి అనుమతి కూడా ఇవ్వలేదని కమిషన్ స్పష్టం చేసింది.
ఫామ్ 6 మార్పులపై వివరణ
ఓటర్ నమోదు కోసం ఉపయోగించే ఫామ్ 6లో మార్పులకు సంబంధించి తలెత్తిన వివాదంపై ఈసీఐ కోర్టుకు వివరిస్తూ ఆ ఫామ్‌లో ఎటువంటి మార్పులు చేయలేదని పేర్కొంది. నిర్ణీత ఫామ్‌ను సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని, అలాగే సర్ ప్రక్రియ కోసం అవసరమైన డిక్లరేషన్ అనేది ఒక ప్రత్యేక పత్రమని స్పష్టం చేసింది. అయితే, దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించే విధానాన్ని ఒక సవరణగా పరిగణించవచ్చని కమిషన్ అంగీకరించింది. సర్ ప్రక్రియ సమయంలో వివరాలను సరిపోలని ఓటర్లు సాధారణంగా విచారణలకు హాజరు కానవసరం లేదని కూడా ఈసీఐ తెలిపింది. బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో) వారి ఇండ్ల నుంచే అవసరమైన పత్రాలను స్వీకరిస్తారని పేర్కొంది. విచారణలు కేవలం అసాధారణ కేసులకే పరిమితం అవుతాయని తెలిపింది.
ఈసీఐనెట్కు రక్షణ
ఈసీఐనెట్ వ్యవస్థపై ఉన్న ఆందోళనలను పరిష్కరిస్తూ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో) నుంచి ఉత్తర్వు లేకుండా ఓటర్ల జాబితాలో ఏ ఓటర్ పేరును చేర్చడం గానీ తొలగించడం గానీ కుదరదని కమిషన్ పేర్కొంది. నిర్దేశిత రక్షణ చర్యలు పాటిస్తున్నారో లేదో పరిశీలించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఈసీఐ పేర్కొంది.
పని కేటాయింపు ఉత్తర్వు
కమిషన్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన ఒక అదనపు కార్యదర్శి జారీ చేసిన జూలై 28 నాటి పని కేటాయింపు ఉత్తర్వును కూడా అఫిడవిట్లో ప్రస్తావించారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు మరుసటి రోజు క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారని, జూలై 30న ఇద్దరు కమిషనర్లు సంయుక్తంగా జారీ చేసిన ఆదేశం తర్వాత కూడా ఆ ఉత్తర్వు ఎన్నడూ అమలు కాలేదని ఈసీఐ వివరించింది. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల నమోదుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి చెందిన అధికారులు వీటిని దాఖలు చేశారని కమిషన్ పేర్కొంది. ఈ విషయాలను తమ దృష్టికి తీసుకురాలేదని కూడా తెలిపింది. తమకు అప్పగించిన అధికార పరిధిని మించి ఆదేశాలు జారీ చేసే ఏ అధికారిపై అయినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

