CEC Rajiv Kumar | ప్రతి ఎన్నిక మాకు అగ్ని పరీక్షే: కేంద్ర ఎన్నికల సంఘం
CEC Rajiv Kumar | ప్రతి ఎన్నిక తమకు అగ్నిపరీక్షేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. గత 70 ఏండ్ల కాలంలో ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు.
బెంగళూరు: ప్రతి ఎన్నిక తమకు అగ్నిపరీక్షేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. గత 70 ఏండ్ల కాలంలో ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నది. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన కసరత్తు చేస్తున్నది.
ఈ క్రమంలో కర్ణాటకలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారా..? అన్న మీడియా ప్రశ్నకు సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. తమకు ప్రతి ఎన్నిక అగ్నిపరీక్షేనని చెప్పారు. అయినా గత 70 ఏండ్లుగా ఎన్నో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇటీవల జరిగిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి మొత్తం 400 అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించామని తెలిపారు.
అదేవిధంగా 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు, 16 సార్లు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా ఫలితాలు అందరి ఆమోదం పొందాయని, ఒకరి నుంచి ఒకరికి శాంతియుతంగా అధికార మార్పిడి జరిగిందని చెప్పారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24 వరకు ఉన్నది. అంటే ఆలోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

