Orange | ఢిల్లీ: రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కు దూరంగా ఎలాగైతే ఉండవచ్చో.. అలాగే రోజుకో ఆరెంజ్ తింటే డిప్రెషన్‌కు దూరంగా ఉండవచ్చట. ఈ మేరకు ‘బయోమెడ్ సెంట్రల్’లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆరెంజ్ తినడం వల్ల డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం 20 శాతం వరకు తగ్గుతుంది. ఆరెంజ్ పండ్లు మానవుని పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి.
ఈ బ్యాక్టీరియా సెరోటోనిన్, డొపమైన్ అనే హార్మోన్లు ఉత్పత్తయ్యేలా చేస్తుంది. ఇవి మనసుకు సంతోషాన్ని కలిగించే హార్మోన్లు. యాంటీడిప్రెషన్ ఔషధాలు ప్రభావం చూపలేకపోతున్న నేపథ్యంలో చౌకగా దొరికే ఆరెంజ్ డిప్రెషన్‌కు దివ్యౌషధంగా పని చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.