Earthquake | అండమాన్ దీవుల్లో మరోసారి కంపించిన భూమి.. 4.3 తీవ్రత
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 61 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సంభవించాయని వెల్లడించింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
కాగా, గత 24 గంటల్లో అండమాన్ దీవుల్లో భూమి కంపించడం ఇది రెండోసారి. బుధవారం ఉదయం 5.40 గంటలకు 5.0 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. అంతకుముందు జూలై 29న అర్ధరాత్రి 12.53 గంటల సమయంలో పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.8గా నమోదయింది. భూఅంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం (Epicentre) పోర్టు బ్లెయిర్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
Earthquake of Magnitude:4.3, Occurred on 03-08-2023, 04:17:58 IST, Lat: 10.69 & Long: 92.05, Depth: 61 Km ,Region: Andaman Islands, India for more information Download the BhooKamp App https://t.co/8M0y9ZgqUA@KirenRijiju @Indiametdept @Dr_Mishra1966 @ndmaindia @Ravi_MoES pic.twitter.com/cWUpfEeOIc
— National Center for Seismology (@NCS_Earthquake) August 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

