న్యూఢిల్లీ: దీపావళి నేపథ్యంలో దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని అక్షరధామ్ ఆలయాన్ని 10,000 మట్టి దీపాలతో అందంగా అలంకరించారు. ఈ దీప కాంతులతో అక్షరధామ్ వెలిగిపోయింది.
మరోవైపు దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా లక్షల సంఖ్యలో మట్టి దీపాలు వెలిగించారు. దీంతో అయోధ్యలోని సరయూ నది తీరం దీప కాంతులతో మెరిసిపోయింది.
#WATCH | Earthern lamps lit up on the bank of Saryu river in Ayodhya as part of the Deepotsav celebration on the occasion of #Diwali pic.twitter.com/lkFfnv6oKk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 3, 2021