Bharat Forecast System | వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భారత ఫోర్కాస్ట్ సిస్టమ్‌ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ జాతికి అంకితం చేశారు. ముందస్తు సమాచారం మరింత ముందుగా తీసుకునే అవకాశం ఉండనున్నది. గతంలో ఆరు కిలోమీటర్లు దూరం అయితే.. ఇప్పుడు 12 కిలోమీటర్ల ముందుగానే తీసుకోవచ్చని ఐఎండీ పేర్కొంది. కొత్త వ్యవస్థ ద్వారా గ్రామాల వారీగా అంచనా ఇవ్వచ్చొని ఐఐటీఎం పుణే డైరెక్టర్ పేర్కొన్నారు. ఐదురోజులు ముందుగానే పక్కా సమాచారం ఇవ్వనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది ఎనిమిది రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చాయన్న ఐఎండీ డైరెక్టర్ మృతుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి సాధారణం కంటే వర్షాలు ఎక్కువగా పడుతాయన్న పేర్కొంది. కొత్త గ్లోబల్ న్యూమరికల్ మోడల్ ఫోర్కాస్ట్ సిస్టమ్‌ను అతివృష్టిని అంచనా వేయడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్‌ను ఐదుగురు మహిళా శాస్త్రవేత్తలు రూపొందించారని పేర్కొన్నారు. ఇది భారతదేశం మహిళా ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతోందనడానికి సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ఇండియన్ మిటియరాలజికల్ డిపార్ట్మెంట్ (IMD) దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాల్గవ స్థానానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విపత్తుల నివారణ ద్వారా, లాభాలను పెంచడం ద్వారా రూ.50వేల కోట్ల కంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందన్నారు. పుణెకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) అభివృద్ధి చేసిన ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత అధిక రిజల్యూషన్ (6 కిలోమీటర్లు) గల వాతావరణ మోడల్. ఇది చిన్న స్థాయి వాతావరణ లక్షణాలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి వాతావరణశాస్త్ర విభాగానికి సహాయపడనున్నది.