న్యూఢిల్లీ, మే 12: ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఏ సమయంలోనైనా కేసు నమోదు చేయడానికి వీలుగా సుప్రీంకోర్టులో ఈ-ఫైలింగ్ 2.0 సేవలు అందుబాటులోకి వచ్చాయి.
శుక్రవారం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ సేవలను ప్రారంభించారు. దీంతోపాటు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘ఈ-సేవా కేంద్ర’ను ప్రారంభించారు. దీని ద్వారా కేసుల నమోదు, వాటి స్థితినితెలుసుకోవచ్చన్నారు. మే 14న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ దినేశ్ మహేశ్వరి సేవలను చీఫ్ జస్టిస్ ప్రశంసించారు.