Tamil Nadu | మదురై ఈడీ ఆఫీసులో కొనసాగుతున్న తనిఖీలు..
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహించారు.
చెన్నై: ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని ఫైల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ భద్రత నడుమ అధికారులు ఈడీ ఆఫీసులో తనిఖీ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రివేళ సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF) ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ఆఫీసును తమిళనాడు పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకోవడంతో వారు గేటు బయటే ఉండిపోయారు.
అంకిత్ తివారీ అనే ఈడీ సీనియర్ అధికారి లంచాన్ని స్వీకరిస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దుండిగల్ జిల్లాలో ఓ వైద్యుడి నుంచి రూ.20 లక్షల లంచం స్వీకరిస్తున్న ఆయనను అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ ఇప్పటికే వెల్లడించింది. కారులో ప్రయాణిస్తున్న అంకిత్ తివారీని దుండిగల్ పోలీసుల సాయంతో ఓ టోల్గేట్ వద్ద ఆపి అరెస్టు చేసినట్టు పేర్కొన్నది.
#WATCH | Tamil Nadu Directorate of Vigilance and Anti-Corruption (DVAC) officials continue the searches at the ED sub-zonal office in Madurai in connection with the case involving ED officer Ankit Tiwari.
ED officer Ankit Tiwari was caught red-handed while accepting a bribe of… pic.twitter.com/UDwQUCtCJX
— ANI (@ANI) December 2, 2023
ఈ సందర్భంగా ఆయన నుంచి ఓ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నామని, ఆయన ఈడీ అధికారిగా పనిచేస్తున్నట్టు ఆ ఐడీకార్డులో ఉన్నదని వివరించింది. అంకిత్ తివారీతోపాటు ఆయన బృందానికి చెందిన ఈడీ అధికారులు కేసుల మాఫీ పేరుతో అనేక మంది ప్రజలను బెదిరించి లంచాలను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. తమిళనాడులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న తరుణంలో ఈ అరెస్టు జరగడం గమనార్హం. ఇసుక మైనింగ్ కేసులో ఇటీవల తమిళనాడులోని ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీచేసిన సమన్లపై కొద్ది రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.
#WATCH | Tamil Nadu Directorate of Vigilance and Anti-Corruption (DVAC) officials continue the searches at the ED sub-zonal office in Madurai in connection with the case involving ED officer Ankit Tiwari.
ED officer Ankit Tiwari was caught red-handed while accepting a bribe of… pic.twitter.com/UDwQUCtCJX
— ANI (@ANI) December 2, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ankit Tiwari
- bribe
- CRPF
- DAVC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

