భోపాల్: కాగడాల ర్యాలీలో అపశృతి జరిగింది. (Flame Torch Procession) ఊరేగింపు తర్వాత మండుతున్న కాగడాలను పట్టుకున్న వారు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి కాలిన గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2009 నవంబర్ 28న పోలీస్ అధికారి సీతారాం బాతం సహా ముగ్గురు వ్యక్తులను నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సభ్యులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు వ్యక్తుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 28న కాగడాలతో ఊరేగింపు నిర్వహిస్తారు.
కాగా, గురువారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీ అర్ధరాత్రి వేళ ఖాండ్వా నగరంలోని క్లౌ టవర్ వద్ద ముగిసింది. దీంతో మండుతున్న కాగడాలను పట్టుకున్న వారు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద నీటి తొట్టిలో తలకిందులుగా కాగడాలను ముంచారు. అయితే ఉన్నట్టుండి పెద్ద ఎత్తున్న మంటలు ఎగసిపడ్డాయి. మహిళలు, పిల్లలతో సహా 30 మందికి కాలిన గాయాలయ్యాయి.
మరోవైపు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక చికిత్స తర్వాత 18 మందిని తమ ఇళ్లకు పంపినట్లు చెప్పారు. మిగిలిన 12 మందికి చికిత్స అందిస్తున్నారని, వారికి ప్రాణాపాయం లేదని వివరించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#Khandwa Ghantaghar #fire: A major fire erupted during a martyr’s procession in Khandwa, Madhya Pradesh, injuring 50 people, 11 critically. The incident occurred when spilled #torch oil ignited, causing a rapid spread of flames among approximately 200 participants. #Mashal pic.twitter.com/Y3ObYPksDu
— Dr. Sandeep Seth (@sandipseth) November 29, 2024