ముంబై: రాజకీయ నేత కుమారుడు ఒక ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో కుప్పకూలి మరణించాడు. (Leader’s Son Dies Of Heart Attack) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడైన 45 ఏళ్ల మిలింద్ మోరే ఆదివారం తన కుటుంబంతో కలిసి నవపూర్‌లోని రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటు వల్ల చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ అయిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివసేన (యూబీటీ) థానే యూనిట్‌కు డిప్యూటీ చీఫ్‌గా మిలింద్ మోర్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.