న్యూఢిల్లీ: సీఎం కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా వచ్చాయి. అకస్మాత్తుగా ఆవుల మంద రోడ్డుపైకి రావడంతో సీఎం కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. (Delhi CM Rekha Gupta) గమనించిన వాహనాల డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. అత్యవసరంగా బ్రేకులు వేసి సీఎం కాన్వాయ్‌ను నిలిపివేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కాన్వాయ్ హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా పశువులు అడ్డుగా వచ్చాయి. దీంతో సీఎం కాన్వాయ్ అత్యవసరంగా ఆగిపోయింది.
కాగా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన వాహనం నుంచి కిందకు దిగారు. కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన ఆవులను పరిశీలించారు. అధికారులతో కలిసి ఫ్లైఓవర్‌పై కొంత దూరం నడిచారు. రోడ్డుపైకి పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత తన నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలను ఆమె సందర్శించారు. పలు వార్డులను పరిశీలించారు. సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయితే సీఎం కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా వచ్చిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Shalimar Bagh: Delhi CM Rekha Gupta instructed the concerned authorities to find proper shelter for stray cattle found on Haiderpur flyover.
(Source – Delhi CMO) pic.twitter.com/CMMpmV9A3E
— ANI (@ANI) March 26, 2025
Delhi: Chief Minister Rekha Gupta’s convoy was forced to make an emergency stop on Haiderpur Flyover when 4-5 stray cattle suddenly wandered onto the roadway.
CM Rekha Gupta personally intervened, directing officials to implement measures to prevent animals from entering the… pic.twitter.com/Th0Xbr3vwy
— IANS (@ians_india) March 26, 2025