Digital Learning: వైఫై, సిమ్‌లు లేవని.. ట్యాబ్‌లు వెనక్కి తీసుకుంటున్న ప్రభుత్వ స్కూళ్లు
Digital Learning: డిజిటల్ విద్యలో భాగంగా హర్యానాలోని ప్రభుత్వ స్కూళ్లలో ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. కానీ ఇప్పుడా ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకుంటున్నారు. వైఫై, సిమ్ కార్డులు లేవని స్కూళ్లు ఆరోపిస్తున్నాయి.
చండీఘడ్: హర్యానా సర్కారు అత్యంత ఆర్భాటంగా ఈ-అధిగమ్ స్కీమ్‌ను ప్రారంభించింది. డిజిటల్ లెర్నింగ్(Digital Learning)లో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత ట్యాబ్‌లను పంచారు. కానీ ఆ స్కీమ్ విఫలమైనట్లు తెలుస్తోంది. కర్నాల్, కతియాల్ జిల్లాల్లో అనేక ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల నుంచి ఆ ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకుంటున్నారు. వైఫై కనెక్టివిటీ , సిమ్ కార్డులు లేకపోవడం, సాంకేతిక సమస్యలు, ఆపరేషనల్ సపోర్ట్ లేకపోవడంతో ట్యాబ్లెట్లను ప్రభుత్వం మళ్లీ తీసేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు డిజిటల్ అంశాల్లో చురుకుగా మారేందుకు ఆ స్కీమ్‌ను అమలు చేశారు. 2022లో సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఆ స్కీమ్‌ను ప్రారంభించారు. ఆ స్కీమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. ప్రీలోడ్ డిజిటల్ కాంటెంట్‌తో పాటు సిమ్ కార్డులు, డెయిలీ 2 జీబీ డేటా కల్పించారు.
వీడియో క్లాసులు వినేందుకు, డిజిటల్ పుస్తకాలు చదివేందుకు, ఆన్లైన్ అసైన్మెంట్ చేసేందుకు ఆ ట్యాబ్లెట్లను ఇచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. వైఫై, సిమ్ కార్డులు లేకపోవడం వల్ల విద్యార్థులకు ట్యాబ్లెట్లు ఉపయుక్తంగా లేవన్నారు. కర్నాల్ జిల్లాలో 32 వేల ట్యాబ్లెట్లను పంచారు. దాంట్లో ప్రస్తుతం 23 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక కథియాల్ జిల్లాలో 27వేల ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. వీటిల్లో కేవలం 20 వేలు మాత్రమే ఫంక్షనల్‌గా ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల డిజిటల్ ట్యాబ్లెట్లు నిరుపయోగంగా ఉంటున్నట్లు టీచర్లు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

