Delhi Pollution | ఢిల్లీలో పెరిగుతున్న కాలుష్యం.. ఆంక్షలు అమలులోకి..
Delhi Pollution | ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో విడత ఆంక్షలు విధించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ గురువారం ఆదేశించింది. సీఏక్యూఎం సమావేశం అనంతరం రాజధానిలో గ్రాప్-3ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Delhi Pollution | ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో విడత ఆంక్షలు విధించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ గురువారం ఆదేశించింది. సీఏక్యూఎం సమావేశం అనంతరం రాజధానిలో గ్రాప్-3ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో గాలి నాణ్యత గురువారం అధ్వాన్నంగా తయారైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా పరిస్థితి ఘోరంగా తయారైంది. గ్రాప్-3 అమలు నేపథ్యంలో అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధాజ్ఞలు అమలు రానున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్బుద్ధనగర్లో పెట్రోల్తో నడిచే బీఎస్-3 ఇంజిన్లు, డీజిల్తో నడిచే బీఎస్-4 వాహనాలను ఉపయోగించడంపై బ్యాన్ విధించారు.
బొగ్గుల కుంపటి, కలపతో వంట చేయడం సైతం నిషేధం అమలులోకి వచ్చింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లను సైతం పర్యవేక్షించనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు, కలప వాడకంపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు మినహా అన్ని రకాల నిర్మాణ కార్యకలాపాలు మూసివేయనుండగా.. చీపుర్లతో రోడ్లను ఊడవడాన్ని నిలిపివేయగా.. క్రమం తప్పకుండా దుమ్మ లేవకుండా నీరు చల్లాలని ఆదేశాలు ప్యానెల్ సూచించింది. హాట్మిక్స్ ప్లాంట్లు, ఇటుక బట్టీలను నడుపడంపై నిషేధం ఉండగా.. ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని అడ్వైజరీ జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

