Watch: రైలు ఆలస్యంపై ప్రయాణికుడు ఆగ్రహం.. మద్యం మత్తులో లోకో పైలట్‌పై దాడి
Drunk Passenger Hits Loco Pilot | రైలు ఆలస్యంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం చెందాడు. మద్యం మత్తులో ఉన్న అతడు లోకో పైలట్‌తో గొడవ పడ్డాడు. ఆపై ట్రైన్ డ్రైవర్ తలపై రాయితో కొట్టాడు. (Drunk Passenger Hits Loco Pilot) దీంతో లోకో పైలట్ తలకు గాయం కావడంతో రక్తం కారింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: రైలు ఆలస్యంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం చెందాడు. మద్యం మత్తులో ఉన్న అతడు లోకో పైలట్‌తో గొడవ పడ్డాడు. ఆపై ట్రైన్ డ్రైవర్ తలపై రాయితో కొట్టాడు. (Drunk Passenger Hits Loco Pilot) దీంతో లోకో పైలట్ తలకు గాయం కావడంతో రక్తం కారింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 17న బుధవారం సమస్తిపూర్-కతిహార్ ప్యాసింజర్ రైలు అరగంట ఆలస్యంగా నడిచింది. దీంతో కర్హగోలా రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుంది.
కాగా, కర్హగోలాకు చెందిన సుశీల్ కుమార్ ఆ రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్లో వేచి ఉన్నాడు. రైలు ఆలస్యంగా రావడంపై అతడు ఆగ్రహించాడు. మద్యం మత్తులో ఉన్న సుశీల్ రైలు ఇంజిన్ వద్దకు వెళ్లాడు. రైలు ఎందుకు ఆలస్యమైందంటూ లోకో పైలట్ ప్రభాస్ చంద్ చౌరాసితో గొడవ పడ్డాడు. డ్రైవర్ క్యాబిన్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. లోకో పైలట్ ప్రభాస్‌ను తిట్టడంతోపాటు రాయితో అతడి తలపై కొట్టాడు. దీంతో తలకు గాయం కావడంతో రక్తం ధారగా కారింది.
మరోవైపు ఆ స్టేషన్‌లోని మిగతా ప్రయాణికులు వెంటనే సుశీల్ కుమార్‌ను చుట్టుముట్టారు. అతడ్ని స్టేషన్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లగా రైల్వే పోలీసులకు అప్పగించారు. గాయపడిన లోకోపైలట్ ప్రభాస్‌కు చికిత్స అందించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ రైలు ఆలస్యంగా ఆ స్టేషన్ నుంచి కదిలింది. కాగా, కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ट्रेन लेट हुई तो फोड़ दिया रेल ड्राइवर का सिर, गाली दिया और कर दिया लहूलुहान
बिहार के कटिहार काढ़ागोला रोड रेलवे स्टेशन पर ट्रेन लेट होने पर एक यात्री ने रेल ड्राइवर का सिर फोड़ दिया और उसे गालियां दी। ट्रेन ड्राइवर के सिर में टांके लगे हैं। आरोपी को हिरासत में लिया गया है।… pic.twitter.com/TYse50cb4a— FirstBiharJharkhand (@firstbiharnews) January 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

