Watch: మద్యం మత్తులో స్కూల్‌కు వెళ్లిన వ్యక్తి.. ఒక విద్యార్థి చెంపపై కొట్టి కాలుతో తన్నాడు
Drunk man slaps, kicks student | మద్యం సేవించిన ఒక వ్యక్తి తన కుమార్తె కోసం ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లాడు. అతడి గురించి అడిగిన ఒక విద్యార్థి చెంపపై పలుమార్లు కొట్టాడు. ఆ బాలుడ్ని కాలుతో తన్నాడు. (Drunk man slaps, kicks student) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: మద్యం సేవించిన ఒక వ్యక్తి తన కుమార్తె కోసం ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లాడు. అతడి గురించి అడిగిన ఒక విద్యార్థి చెంపపై పలుమార్లు కొట్టాడు. ఆ బాలుడ్ని కాలుతో తన్నాడు. (Drunk man slaps, kicks student) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విన్సెంట్ రాజ్ అనే వ్యక్తి మద్యం సేవించిన మత్తులో ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లాడు.
కాగా, అక్కడ చదువుతున్న తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లిన అతడ్ని ఎవరని ఒక విద్యార్థి అడిగాడు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆ విద్యార్థిపై దాడి చేశాడు. ఆ బాలుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అలాగే కాలితో తన్నాడు. ఇది చూసి మిగతా విద్యార్థులు భయంతో దూరంగా పారిపోయారు. అనంతరం ఆ వ్యక్తి తన కుమార్తెను ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు బాధిత విద్యార్థి తండ్రి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో విన్సెంట్ రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ వ్యక్తి విద్యార్థిని కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Watch: Drunk man abuses, kicks minor at a government school in Tamil Nadu’s Tiruchirappalli.
The man, now arrested, was identified as the father of another student studying at the school. #Viral #ViralVideo #TamilNadu pic.twitter.com/nKF3Uv5aTm
— Vani Mehrotra (@vani_mehrotra) October 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

